Hot Air Balloon | రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హాట్ ఎయిర్ బెలూన్ (Hot Air Balloon)లో చిక్కుకుని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బారన్ (Baran) జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
బారన్ జిల్లా ఫౌండేషన్ డే సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శనను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఈ మేరకు హాట్ ఎయిర్ బెలూన్ను పరీక్షిస్తుండగా ఉన్నట్టుండి బెలూన్ గాలిలోకి ఎగిరింది. దీంతో రాజస్థాన్ కోటా (Kota)కు చెందిన వాసుదేవ్ ఖత్రి (Vasudev Khatri) అనే వ్యక్తి బెలూన్‌కు కట్టి ఉన్న తాడుకు చిక్కుకుని గాల్లోకి ఎగిరాడు. దాదాపు వంద అడుగుల ఎత్తుకు చేరుకున్నాక తాడు తెగడంతో కిందపడిపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. దీంతో మూడు రోజులపాటూ నిర్వహించ తలపెట్టిన వేడుకలను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
बारां में हॉट एयर बैलून शो करते समय हादसा हो गया बैलून की रस्सी पकडऩे वाला कर्मचारी बैलून के साथ हवा में उड गया इस दौरान बैलून की रस्सी टूट गई ओर कर्मचारी 80 फीट नीचे गिर गया जिसको तुरंत अस्पताल ले जाया गया जहां उपचार के दौरान कर्मचारी की मौत हो गई@Hemraj_GurjarDB #Baran pic.twitter.com/IYvXGXJfW7
— Cheshta Enterprises (@CheshtaE) April 10, 2025
Also Read..
Lightning | బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి
Tahawwur Rana | ఎవరీ తహవూర్ రాణా..? ముంబై ఉగ్రదాడిలో అతడి పాత్రేంటి..?