Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి (Air India Express Flight) సెక్యూరిటీ త్రెట్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
బుధవారం సాయంత్రం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 1023 ముంబై నుంచి వారణాసికి (Mumbai To Varanasi) వెళ్తోంది. విమానం గాల్లో ఉండగా బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అన్ని సెక్యూరిటీ నిబంధనలూ పాటిస్తూ విమానాన్ని వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 182 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్‌గానే ఉన్నట్లు వెల్లడించారు. విమానంలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Al-Falah University | ఉగ్రకుట్రకు అడ్డాగా 17వ నంబర్ భవనం.. పథక రచన మొత్తం ఆ గది నుంచే..!
Delhi Blast | ఢిల్లీలో మరోసారి పేలుడు శబ్దం.. భయంతో వణికిపోయిన స్థానికులు.. చివరికి
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్