Delhi Blast | ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ కుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని తేలడంతో నగర వాసులు భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పేలుడు శబ్దం వినిపించినా ఉలిక్కిపడుతున్నారు. తాజాగా ఢిల్లీలో తాజాగా భారీ శబ్దం (Explosion sound) కలకలం రేపింది.
గురువారం ఉదయం ఢిల్లీలోని మహిపాల్పూర్ (Mahipalpur) ప్రాంతంలో రాడిసన్ హోటల్ (Radisson Hotel) సమీపంలో పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరోసారి పేలుడు జరిగిందని ఆందోళన చెందారు. అయితే, అది పేలుడు కాదని అధికారులు తేల్చారు. ఆ శబ్దం బస్సు టైర్ పేలడం వల్ల వచ్చిందిగా తేల్చారు. ఢిల్లీ అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘మహిపాల్పూర్ ప్రాంతంలో రాడిసన్ హోటల్ సమీపంలో భారీ శబ్దం వచ్చిందంటూ అగ్నిమాపక శాఖకు ఉదయం 9:18 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే, ఆ శబ్దం టైరు పేలడం వల్ల వచ్చింది. పేలుడు కాదు’ అని తెలిపారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Also Read..
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య
Delhi Blast | బ్లాస్ట్‌కు ముందు మసీదును సందర్శించిన ఉమర్.. సీసీటీవీ దృష్యాలు వైరల్
Delhi Blast Case | సరిపోలిన డీఎన్ఏ.. ఆ కారు నడిపింది డాక్టర్ ఉమర్ నబీయేనని నిర్ధారణ