Fighter Jet Crashes | రాజస్థాన్ (Rajasthan)లో ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు (Indian Air Force) చెందిన యుద్ధ విమానం కుప్పకూలింది (Fighter Jet Crashes). ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
చురు (Churu) జిల్లా రతన్‌గఢ్ ప్రాంతంలోని భానుడా గ్రామ సమీపంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం (Jaguar fighter aircraft) కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
ఇద్దరు వైమానిక సిబ్బంది గాయపడినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయల్దేరి వెళ్లారు. ప్రమాదం సమయంలో పెద్ద శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఫైటర్ జెట్ పొలాల్లో కూలిందని, భారీగా మంటలు, పొగ ఎగసిపడినట్లు చెప్పారు.
Also Read..
Tahawwur Rana | 26/11 ముంబై దాడుల కేసు.. తహవ్వూర్ రాణా జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
PM Modi | వంతెన కూలిన ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Amarnath Yatra | కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర.. తొలి ఆరు రోజుల్లోనే లక్ష మందికిపైగా దర్శనం