Plane Crash | అహ్మదాబాద్‌లో ఇటీవలే జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించిన వారి మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక మిగతా గుర్తింపు మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని అధికారులు డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే. నేడి రూపానీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి.
దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్
ఎయిర్ ఇండియా(Ahmedabad Plane Crash) విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికినట్లు దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు ద్రువీకరించారు. విమాన ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్న అంశాలను కనుగొనడంలో కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కీలకం కానున్నది.
గతవారం ఎయిర్ ఇండియాకు చెందిన డ్రీమ్‌లైనర్ ఫ్లైట్ అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విషయం తెలిసిందే. లండన్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్‌లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు విమాన ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read..
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌కు బోయింగ్ నిపుణులు.. దొరికిన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్
Hajj flight | వీల్ నుంచి మంటలు.. దేశంలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
Corona Virus | 24 గంటల్లో 101 మందికి పాజిటివ్.. 11 మంది మృతి