Corona Virus | దేశంలో కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కేసుల పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 24 గంటల్లో 101 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న ఒక్కరోజే 11 మంది మరణించారు.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,920 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్‌లో 275, రాజస్థాన్‌లో 222, తమిళనాడులో 220 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,264కి పెరిగింది. నిన్న కేరళలో ఏడుగురు, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది.
Also Read..
Bomb Threat | షార్కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు
Bomb Threats | జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం వెనక్కి మళ్లింపు
KTR | రాజకీయ ప్రతీకార చర్యలకు ఎప్పటికీ నిరుత్సాహ పడం.. మీ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం: కేటీఆర్