KTR | రాజకీయ ప్రతీకార చర్యలకు ఎప్పటికీ నిరుత్సాహ పడం.. మీ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటాం: కేటీఆర్
విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపుల వల్ల వెనక్కి తగ్గేదేలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవీ తమను ఆపలేవన్నారు.
హైదరాబాద్: విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపుల వల్ల వెనక్కి తగ్గేదేలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవీ తమను ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు కాంగ్రెస్ చేసిన దగాను ఎండగడుతూనే ఉంటామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ‘మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహ పడను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, ఫార్ములా వన్ ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నందీనగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. అనంతరం కేటీఆర్.. తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ నేతలు బాల్క సుమన్, పటోళ్ల కార్తిక్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు.
I will never be deterred by your enquiries, commissions and political vendetta
We @BRSparty will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees
Bring it on Revanth 👍 pic.twitter.com/yFUOXmoeoP
— KTR (@KTRBRS) June 16, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

