Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమిళనాడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తులు షార్లో బాంబు ఉన్నట్లు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు షార్ పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. మరోవైపు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి గురించి ఆరా తీయగా.. ఇది ఆకతాయి పని అని తేలింది. ఈ మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Bomb Threats | జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం వెనక్కి మళ్లింపు
Honey And Amla Mixture | తేనెలో ఉసిరికాయలను నానబెట్టి తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
KTR | తెలంగాణ భవన్కు చేరుకున్న కేటీఆర్.. మరికాసేపట్లో ఏసీబీ విచారణకు