Delhi Rain | గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండ వేడిమితో అల్లాడిపోయిన దేశరాజధాని ఢిల్లీ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఇవాళ ఢిల్లీ – ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం (light rain) కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇన్నరోజులూ ఉక్కపోతకు తట్టుకోలేకపోయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త రిలీఫ్ పొందారు. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోనూ వర్షం పడింది.
#WATCH | Delhi gets respite from heat as it receives light rain pic.twitter.com/obBMjy883l
— ANI (@ANI) June 21, 2024
కాగా, గత కొన్ని రోజులుగా ఉత్తర భారత దేశం అగ్నిగుండంలా మారింది. దేశరాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు నీటి సంక్షోభంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతున్నారు. రాత్రి సమయంలో కూడా వాతావరణం చల్లబడటం లేదు. గత 14 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రాత్రి వేళ కూడా రాజధానిలో 35.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిపోతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
#WATCH | Delhi: Slight respite from the sizzling heatwave; rain lashes parts of national capital
(Visuals from RK Puram) pic.twitter.com/3TWH5qAUE5
— ANI (@ANI) June 21, 2024
#WATCH | After weeks of unbearable heat, parts of Delhi witness light rain.
(Visuals from RK Puram) pic.twitter.com/WvBwPBxX2p
— ANI (@ANI) June 21, 2024
#WATCH | Delhi-NCR witnesses sudden weather change after weeks of punishing heat; rain lashes parts of Gurugram
(Visuals from Sadar Bazar) pic.twitter.com/uxcnifwaG5
— ANI (@ANI) June 21, 2024
#WATCH | Delhi: Rain lashes parts of the national capital, brings respite from heat and rising temperatures. pic.twitter.com/LYqNl8aPvo
— ANI (@ANI) June 21, 2024
Also Read..
Yoga day | ఎత్తయిన పిర్‌పంజాల్ పర్వత శ్రేణిపై భారత సైనికుల యోగాసనాలు.. Video
Yoga Day | శ్రీశైలం దేవస్థానంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Tirumala | తిరుమలలో స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం