Yoga day : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకున్నాయి. మన దేశంలో కూడా తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో రకరకాల యోగాసనాలు వేసి యోగా డే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సహా అన్ని రంగాలకు చెందిన వారు ఈ యోగా డేలో పాల్గొన్నారు. భారత సైనికులు ఎక్కడికక్కడ యోగా డే జరుపుకున్నారు. ఎత్తయిన పిర్‌పంజాల్ పర్వతశ్రేణిపై సైనికులు యోగాసనాలు వేస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.
WATCH | Indian Army personnel performed Yoga in the higher Pir Panjal ranges along the Line of Control, today
(Video source: Indian Army) pic.twitter.com/2amkwfK6iG
— ANI (@ANI) June 21, 2024
ప్రధాని నరేంద్రమోదీ చొరవతో 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిలో ఒక్కరోజు యోగా డే జరుపుకోవాలన్న ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదనకు 2014 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలోని 193 దేశాలు ఆమోదం తెలిపాయి. దాంతో 2015 నుంచి జూన్ 21 యోగా డే అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున జరిగిన యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు.