అమరావతి : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు (Compartments) కూడా నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 62,756 మంది భక్తులు దర్శించుకోగా 31,510 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 4.23 కోట్లు వచ్చిందని తెలిపారు.
జూన్ 22న పౌర్ణమి గరుడసేవ
తిరుమల : పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22న శనివారం గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.