Kushboo Sundar | రాహుల్‌కు జైలు శిక్ష.. మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్
Kushboo Sundar | ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ (BJP) నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ( National Commission for Women) ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) గతంలో మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Kushboo Sundar | ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి సూరత్ కోర్టు (Surat Court) రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం.. రాహుల్ ఎంపీ (Mp) సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సినీ నటి, బీజేపీ (BJP) నాయకురాలు, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ( National Commission for Women) ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) గతంలో మోదీ ఇంటి పేరుపై చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఖుష్బూ (Kushboo Sundar) కాంగ్రెస్ (Congress) పార్టీలో ఉన్న సమయంలో మోదీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తోందంటూ 2018 సంవత్సరంలో ఓ ట్వీట్ పెట్టారు. ‘ఇక్కడ మోదీ.. అక్కడ మోదీ.. ఎక్కడ చూసినా మోదీనే.. అసలేంటి ఇది?? ప్రతి మోదీ వెనుక భ్రష్టాచార్ ( అవినీతి ) అనే ఇంటి పేరు పెట్టాలి. మోదీ అంటేనే అవినీతి. మోదీ పేరును అవినీతిగా మార్చేద్దాం. అదే సరిగ్గా సరిపోతుంది. నీరవ్, లలిత్, నమో = అవినీతి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Yahan #Modi wahan #Modi jahan dekho #Modi..lekin yeh kya?? Har #Modi ke aage #bhrashtachaar surname laga hua hai..toh baat ko no samjho..#Modi mutlab #bhrashtachaar..let's change the meaning of #Modi to corruption..suits better..#Nirav #Lalit #Namo = corruption..👌👌😊😊
— KhushbuSundar (@khushsundar) February 15, 2018
ఎంపీ దిగ్విజయ్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఖుష్బూ ట్వీట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. బీజేపీపై మండిపడుతున్నారు. ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నిస్తున్నారు.
‘మోదీ జీ.. ‘మోదీ’ ఇంటి పేరును అవినీతిగా పేర్కొన్న సుందర్‌పై పరువు నష్టం కేసు వేస్తారా..? ప్రస్తుతం ఆమె బీజేపీ సభ్యురాలిగా ఉన్నారు’ అంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న ఖుష్బూ 2020 అక్టోబర్‌లో బీజేపీలోకి చేరారు.
मोदी जी @narendramodi क्या आप @khushsundar पर भी मान हानि का मुक़दमा मोदी नाम वाले अपने किसी शिष्य से दायर करवाएँगे? अब तो वे @BJP4India की सदस्य हैं। देखते हैं। धन्यवाद @zoo_bear @INCIndia @RahulGandhi https://t.co/qIibuycY6n
— Office Of Digvijaya Singh (@OfficeOfDVS) March 25, 2023
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ (Pm Modi) ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గానూ.. బీజేపీ నేతలకు కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన గుజరాత్‌లోని సూతర్ కోర్టు (Surat Court) రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రెండేండ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్షను 30 రోజుల పాటు నిలుపుదల చేసింది. కోర్టు తీర్పుతో రాహుల్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
Also Read..
Rahul Gandhi | సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక..?
Mark Zuckerberg | మూడోసారి తండ్రైన మార్క్ జుకర్‌బర్గ్.. ఫొటో షేర్ చేసిన మెటా సీఈవో
EPFO Recruitment | ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

