Cyclone Biparjoy | రాజస్థాన్ కు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్జ్ జారీ చేసిన ఐఎండీ
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ (Gujarat)లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి తర్వాత గుజరాత్ (Gujarat)లోని కచ్ ప్రాంతంలో తీరం దాటింది. తీరం దాటిన సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
సౌరాష్ట్ర-కచ్ మీదుగా మధ్యాహ్నం సమయంలో క్రమంగా బలహీనపడినట్లు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ రాజస్థాన్వైపు కదులుతున్న తుపాను.. సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో రాజస్థాన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్ లోని బార్మర్, జాలోర్, జైసల్మేర్, జోధ్ పూర్, పాలి తదితర ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
తుపాను కారణంగా శుక్ర, శనివారాల్లో బార్మర్-జోధ్ పూర్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. జోధ్ పూర్ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని కళాశాలల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. మరోవైపు జైసల్మేర్ లోని డబ్లా గ్రామం నుంచి 100 కుటుంబాలకు చెందిన సుమారు 450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Also Read..
Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన
Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
Cyclone Biparjoy | విషాదం.. మేకల్ని రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

