Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
Al Pacino | హాలీవుడ్ (Hollywood) ప్రముఖ స్టార్, ‘ది గాడ్ ఫాదర్’ (The Godfather ) సిరీస్ నటుడు ఆల్ పాసినో (Al Pacino) 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రయ్యాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్ అల్ఫాల్లా (Noor Alfallah) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
Al Pacino | హాలీవుడ్ (Hollywood) ప్రముఖ స్టార్, ‘ది గాడ్ ఫాదర్’ (The Godfather ) సిరీస్ నటుడు ఆల్ పాసినో (Al Pacino) 83 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు తండ్రయ్యాడు. తన 29 ఏళ్ల ప్రేయసి, చిత్ర నిర్మాత నూర్ అల్ఫాల్లా (Noor Alfallah) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈ జంట ధృవీకరించింది. తమ కుమారుడికి రోమన్ పాసినో (Roman Pacino) అని నామకరణం కూడా చేసినట్లు వెల్లడించింది. ఆల్ పాసినో- నూర్ మధ్య కరోనా సమయంలో పరిచయం ఏర్పడింది. 2022 ఏప్రిల్ నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు.
కాగా, ఆల్ పాసినోకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాజీ ప్రియురాలు, యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ (Jan Tarrant) తో ఓ కుమార్తెకు తండ్రయ్యాడు. ప్రస్తుతం ఆ కుమార్తె వయసు 33 ఏళ్లు. అనంతరం 1997 నుంచి 2003 వరకు బెవర్లీ డి ఏంజెలో (Beverly D’Angelo)తో కలిసి ఉన్నాడు. వీరిద్దరికీ కవలలు ఆంటోన్, ఒలివియా పుట్టారు . ప్రస్తుతం వారి వయసు 22 ఏళ్లు. ఇక నూర్ అల్ఫాల్లా గతంలో ప్రముఖ గాయకుడు మిక్ జాగర్, బిలియనీర్ నికోలస్ బెర్గూన్తో డేటింగ్ చేసింది.
Also Read..
MS Dhoni | బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో..!
Canada | వృద్ధులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 15 మంది మృతి
Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్లు.. కేంద్ర మంత్రి రంజన్ సింగ్ ఇంటిపై పెట్రో బాంబులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

