Canada | వృద్ధులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 15 మంది మృతి
కెనడాలోని (Canada) మానిటోబాలో (Manitoba) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానిటోబాలోని కార్బెర్రీ (Carberry) టౌన్ సమీపంలో వృద్ధులతో వెళ్తున్న మినీ బస్సును (Mini bus) ఓ సెమీ ట్రెయిరల్ ట్రక్కు (Semi-trailer truck) ఢీకొట్టింది. దీంతో 15 మంది మరణించారు.
ఒట్టావా: కెనడాలోని (Canada) మానిటోబాలో (Manitoba) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానిటోబాలోని కార్బెర్రీ (Carberry) టౌన్ సమీపంలో వృద్ధులతో వెళ్తున్న మినీ బస్సును (Mini bus) ఓ సెమీ ట్రెయిరల్ ట్రక్కు (Semi-trailer truck) ఢీకొట్టింది. దీంతో 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ఉన్నారని చెప్పారు. వారిలో అధికులు వృద్ధులేనని (Elderly people) వెల్లడించారు. అయితే ట్రక్కు, బస్సు డ్రైవర్లు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందనే విషయం తెలియాల్సి ఉందన్నారు.
కాగా, ప్రమాద ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau) దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అయినవారిని కోల్పోవడం ఎంత బాధ ఉంటుందో తననకు తెలుసునన్నారు. తన ఆలోచనలన్నీ వారితోనే ఉన్నాయని చెప్పారు. ఇటీవల కెనడాలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలలో ఇదొకటి పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

