Cyclone Biparjoy | విషాదం.. మేకల్ని రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు మృతి
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ (Gujarat) లోని కచ్ (Kutch) ప్రాంతంలో తీరం దాటింది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది.
Cyclone Biparjoy | అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను (Cyclone Biparjoy) గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్ (Gujarat) లోని కచ్ (Kutch) ప్రాంతంలో తీరం దాటింది. తీరాన్ని దాటే సమయంలో ఈ తుపాను గుజరాత్ లో అల్లకల్లోలం సృష్టించింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కచ్, సౌరాష్ట్ర తదితర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. భావ్ నగర్ (Bhavnagar ) జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా వరద పోటెత్తింది. దీంతో లోయలో చిక్కుకున్న మేకలను (goat) రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు ప్రాణాలు కోల్పోయారు.
గురువారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సిహోర్ పట్టణానికి సమీపంలోని భండార్ గ్రామం గుండా వెళ్తున్న లోయలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో లోయలో ఉన్న మేకలను రక్షించేందుకు రామ్ జీ పర్మార్ (55), అతని కుమారుడు రాకేష్ పర్మార్ (22) అక్కడికి వెళ్లారు. మేకలను కాపాడే క్రమంలో వరద ఉధృతి కారణంగా నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో 22 మేకలు కూడా మృతి చెందినట్లు తెలిపారు.
కాగా, గుజరాత్‌లోని తీరప్రాంతాల్లో బిపర్జాయ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. ఇళ్లు కూలిపోతున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలతోపాటు ద్వారకలోని గోమతి ఘాట్ (Gomti Ghat), దమణ్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. భీకర గాలులతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో తీర ప్రాంతాల్లోని దాదాపు 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మరోవైపు తుపాను తీరందాటిన ప్రాంత పరిసరాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. ద్వారకలోని ప్రాచీన ఆలయం సహా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను, గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. . 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్టీఆర్ఎఫ్ బృందాలతోపాటు రోడ్లు,భవనాల శాఖకు చెందిన 115 బృంధాలను అధికారులు సిద్ధంగా ఉంచారు. తుఫాను కారణంగా రాష్ట్రంలో 99 రైళ్లను రైల్వే శాఖ రద్దుచేసింది.
Also Read..
Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
MS Dhoni | బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో..!
Kupwara Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

