Kupwara Encounter | కుప్వారాలో ఎన్కౌంటర్.. ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా (Kupwara) జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలో ఉన్న జుమాగండ్‌లో (Jumagund) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు (Terrorists) హతమయ్యారు.
కుప్వారా: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా (Kupwara) జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలో ఉన్న జుమాగండ్‌లో (Jumagund) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు ముష్కరులు (Terrorists) హతమయ్యారు. గురువారం తెల్లవారుజామున జుమాగండ్ వద్ద విదేశీ ఉగ్రవాదులు (Foreign terrorists) భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సైన్యంపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు. ప్రతిగా జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదురుగు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులతోపాటు సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లడపడుతున్నదని ట్వీట్ చేశారు. మరణించిన ముష్కరులంతా విదేశీయులని వెల్లడించారు.
ఈ నెల 13న కూడా కుప్వారాలో ఎల్ఓసీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని డోబనార్ మచ్చల్ (Dobanar Machhal) ప్రాంతంలో పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్‌కౌందర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

