Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన
Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి తల్లితండ్రులు కాబోతున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Upasana | టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు తొలిసారి తల్లితండ్రులు కాబోతున్నారు. ఉపాసన త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. కాగా, ఉపాసన-రామ్ చరణ్ జంట ఇటీవలె 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
తాను ప్రెగ్నెంట్ అని మొదట చెప్పినప్పుడు చరణ్ స్పందనను ఉప్సీ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనిపిస్తోంది అంటూ ముందుగా చరణ్ కి చెప్పా. చరణ్ వెంటనే దీని గురించి ఎక్కువగా ఎగ్జైట్ అవ్వొద్దు. ప్రశాంతంగా ఉండు. పరీక్షలు అన్నీ చేయించిన తర్వాత నిర్ధారించుకుందాం అని చెప్పాడు. కన్ఫార్మ్ అయ్యాక ఆయన ఎంతో సంతోషించాడు. తన స్టైల్ లో సెలబ్రేట్ చేశాడు. చరణ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎంతగానో ఆరాధిస్తా. చాలా ప్రశాంతంగా ఆలోచిస్తాడు. అందుకే నేను ఏ విషయాన్ని అయినా వెంటనే వ్యక్తం చేస్తా. కానీ చరణ్ ప్రతి విషయాన్ని చాలా కూల్ గా తీసుకుంటాడు. ఆయన వల్లే నేను లైఫ్ లో ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఓ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకొని అందులో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో అత్త, మామల (చిరంజీవి, సురేఖ) ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్లు ఉపాసన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘ప్రస్తుతం నేను, చరణ్.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నాం. బేబీ పుట్టిన తర్వాత మేము అత్తమామలతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే.. నేను కానీ, చరణ్ కానీ ఈ స్థాయికి చేరుకున్నామంటే అది మా గ్రాండ్ పేరెంట్స్ పంచిన ప్రేమ వల్లే. వాళ్ల నుంచి మేం ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. ఆ ప్రేమ, ఆనందం నా బిడ్డకు కూడా దాక్కాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఉప్సీ తెలిపింది. ప్రస్తుతం ఉపాసన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read..
Tonga Earthquake | టోంగాలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం
Cyclone Biparjoy | విషాదం.. మేకల్ని రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు మృతి
Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

