Tonga Earthquake | దక్షిణ పసిఫిక్ మహాసముద్రం (pacific ocean)లోని టోంగా (Tonga) సమీపంలో శుక్రవారం భారీ భూకంపం ( Earthquake ) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 7.2గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (U.S. Geological Survey) వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
టోంగాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్ల (174 మైళ్ల) దూరంలో 167.4 (104 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. భూకంపం తర్వాత యుఎస్ వెస్ట్ కోస్ట్, బ్రిటిష్ కొలంబియా, అలాస్కాకు సునామీ ముప్పు లేదని యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ తెలిపింది. ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ కూడా ఆస్ట్రేలియాకు సునామీ ముప్పు లేదని తెలిపింది.
Also Read..
Al Pacino | 83 ఏళ్ల వయసులో నాలుగో సారి తండ్రైన స్టార్ నటుడు..
MS Dhoni | బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో..!
Cyclone Biparjoy | విషాదం.. మేకల్ని రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు మృతి