అహ్మదాబాద్: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఫ్లైట్ నంబర్ 171కు వీడ్కోలు పలకనున్నది. (flight number 171) విమాన ప్రమాదం మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171ను ఉపసంహరించుకున్నది. జూన్ 17 నుంచి ఇది అమలులోకి రానున్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో సుమారు 270 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మృతులకు నివాళిగా ఫ్లైట్ నంబర్ 171కు ఎయిర్ ఇండియా స్వస్తి చెప్పనున్నది. ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా విమాన నంబర్ 171ను రద్దు చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.
కాగా, జూన్ 17 నుంచి అహ్మదాబాద్-లండన్ గాట్విక్ విమాన సర్వీసు నంబర్ ఏఐ 171కు బదులుగా ఏఐ 159 ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఈ మేరకు అవసరమైన మార్పులు శుక్రవారం జరిగినట్లు చెప్పారు.
మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా విమాన నంబర్ ఐఎక్స్ 171ను తొలగించాలని నిర్ణయించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. విమానం నంబర్ 171ను నిలిపివేయడం మరణించిన వారి ఆత్మకు గౌరవ సూచకమని చెప్పారు. 2020లో కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 21 మంది మరణించారు. ఆ తర్వాత ఆ విమాన నంబర్‌ను వినియోగించడాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిలిపివేసింది.
Also Read:
విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు.. అదనంగా రూ.25 లక్షల పరిహారం: ఎయిర్ ఇండియా
డీఎన్ఏ మ్యాచ్ తర్వాత.. తొలి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగింత
ఒకసారి పూర్తిగా బోయింగ్ 787 భద్రతా తనిఖీలు.. ప్రయాణాలు ఆలస్యం: ఎయిర్ ఇండియా