అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో (Air India Plane Crash) మరణించిన వారిని డీఎన్ఏ పరీక్ష ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. డీఎన్ఏ మ్యాచింగ్ తర్వాత నిర్ధారించిన తొలి మృతదేహాన్ని బాధిత కుటుంబానికి శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొన్నది. దుఃఖిస్తున్న బంధువులు మృతదేహాన్ని అందుకున్నారు. గుజరాత్ మంత్రి జగదీష్ విశ్వకర్మ ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు. అధికారిక ఎస్కార్ట్‌తో మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు.
కాగా, విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది, ఇతర వ్యక్తులతో సహా 270 మందికిపైగా మరణించారు. విమానంలో మంటల వల్ల చాలా మంది సజీవదహనమయ్యారు. ఈ నేపథ్యంలో డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులందరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షల ప్రక్రియను సమీక్షించారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్), హోం శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాధితులను గుర్తించి, మృతదేహాలను వీలైనంత త్వరగా వారి కుటుంబాలకు అప్పగించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని హర్ష్ సంఘవి తెలిపారు.
Ahmedabad, Gujarat: After DNA confirmation at Ahmedabad Civil Hospital, the deceased’s body was handed over to the family with an official escort. Minister Jagdish Vishwakarma was present during the handover pic.twitter.com/5N0TpFyghy
— IANS (@ians_india) June 14, 2025
Also Read:
విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు.. అదనంగా రూ.25 లక్షల పరిహారం: ఎయిర్ ఇండియా
ఒకసారి పూర్తిగా బోయింగ్ 787 భద్రతా తనిఖీలు.. ప్రయాణాలు ఆలస్యం: ఎయిర్ ఇండియా