Chandrayaan – 3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో (ISRO) విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole)పై విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)ను దించింది. విజయవంతమైన ఈ ప్రయోగంతో మన దేశ కీర్తిని ఇస్రో ప్రపంచ వ్యాప్తంగా చాటింది. దీంతో ప్రపంచ దేశాలు భారత్ కృషిని కొనియాడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ఫుల్ ల్యాండింగ్ కాగానే ప్రపంచ నాయకులు, శాస్త్రవేత్తలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (S Somanath)కు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ తన సహోద్మోగులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ క్లిప్‌ను బుధవారం రాత్రి ట్విట్టర్ వినియోగదారులు షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు చంద్రయాన్-3 పోస్ట్ ల్యాండింగ్ పార్టీ సమయంలోదిగా తెలుస్తోంది. మిషన్ సక్సెస్ తో వారంతా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Chief Dr. S. Somanath & team ISRO 🫡#Chandrayaan3 pic.twitter.com/9a7dH7svrg
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2023
Also Read..
Chandrayaan-3 Success : ఇస్రో చీఫ్ సోమనాధ్‌ను సన్మానించిన సిద్ధరామయ్య
Chandrayaan-3 | చంద్రయాన్-3 సక్సెస్‌లో రామగుండం వాసి