Chandrayaan-3 | చంద్రయాన్-3 సక్సెస్‌లో రామగుండం వాసి
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కేవీఎల్ కార్తీక్ కృషి ఉంది.
Chandrayaan-3 | జ్యోతినగర్, ఆగస్టు 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కేవీఎల్ కార్తీక్ కృషి ఉంది. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌నకు చెందిన కార్తీక్ పదోతరగతి వరకు చిన్మయి విద్యాలయం(ప్రస్తుతం సచ్దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ)లో చదువుకున్నాడు. అనంతరం విజయవాడలో ఇంటర్, హైదరాబాద్‌లో బీటెక్, బెంగుళూరులో ఎంటెక్ చదివి క్వాల్కమ్లో ఏడాది పాటు పనిచేశాడు. ఏడేండ్ల క్రితం ఇస్రోలో శాస్త్రవేత్త అయ్యాడు.
కాగా కార్తీక్ తల్లిదండ్రులు కేవీఎల్ సత్యప్రసాద్, రమాదేవి సచ్దేవ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కాగా పెద్ద కొడుకు కార్తీక్ దేశ ఖ్యాతిని పెంపొందించే ఇస్రోలో శాస్త్రవేత్తగా రాణిస్తున్నాడు. దేశం సగర్వంగా చెప్పుకునే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన బృందంలో తమ కొడుకు ఉండడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

