Digital Voter ID Card | అందుబాటులో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు.. మీ ఫోన్ ద్వారానే చాలా ఈజీగా పొందవచ్చు.. ఎలా అంటే..?
Digital Voter ID Card | ఓటు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడి హక్కు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డును అందిస్తోంది. ఈ కార్డు ఓటింగ్ సమయంలోనే కాకుండా చాలా సందర్భాల్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఓటరు ఐడీ కార్డును ఇప్పుడు మనం డిజిటల్ రూపంలో కూడా పొందవచ్చు. అది ఎలాగంటే..?
Digital Voter ID Card | ఓటు భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడి హక్కు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డును అందిస్తోంది. ఈ కార్డు ఉంటేనే రాజ్యాంగం కల్పించిన మీ ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు. ఈ కార్డు ఓటింగ్ సమయంలోనే కాకుండా చాలా సందర్భాల్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, చాలా మంది ఆదార్ కార్డు, పాన్ కార్డును క్యారీ చేసినట్లు ఓటరు కార్డును తమ వద్ద ఉంచుకోరు. ఓటు వేసే సమయంలో మాత్రమే దాన్ని బయటకు తీస్తుంటారు. అత్యవసర సమయంలో కూడా ఒక్కోసారి దాన్ని ఇంట్లోనే వదిలేసి వెళ్తుంటారు. అలా ఓటరు కార్డును ఇంట్లో వదిలేసి వెళ్లినప్పుడు అవసరమైన పని ఆగిపోయే పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి సమయంలో మన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారానే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు (Digital Voter ID Card)ను పొందవచ్చు. అంటే ఆదార్, పాన్ కార్డ్స్ లాగా అన్నమాట. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ కాపీని ఉంచుకుని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సులభంగా వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి ఓటు వేయచ్చు కూడా.
డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకునే ఫీచర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది. భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా 1 శాతం మంది మాత్రమే డిజిటల్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ ఓటర్ కార్డును ఎడిట్ చేయలేని పీడీఎఫ్ ఫైల్ రూపంలో పొందవచ్చు. దీన్నే ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్ నుంచి దీనిని సులువుగా పొందవచ్చు. పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకున్న డిజిటల్ కార్డును ప్రింట్ తీసుకుని లామినేట్ సైతం చేయించుకుని వినియోగించుకోవచ్చు.
డిజిటల్ ఓటరు ఐడీ కార్డ్ ముఖ్య లక్ష్యం
డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డుల ప్రధాన లక్ష్యం ఓటరు గుర్తింపు కార్డులను డిజిటల్ ఫార్మాట్లో జారీ చేయడమే. ఈ విధానం ద్వారా పౌరులు ఓటరు గుర్తింపు కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డును కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే చాలా సులభంగా పొందవచ్చు. దీని వల్ల చాలా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సిస్టమ్‌లో పారదర్శకత కూడా వస్తుంది.
ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును ఎలా పొందాలంటే..
- ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ http://eci.gov.in/e-epic/ లోకి వెళ్లాలి.
- ఈసీ వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి.
- మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి.
- వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
- ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి.
- నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లోనే మీ స్మార్ట్ ఫోన్లో డిజిటల్ కార్డు ఉంటుంది.
అదేవిధంగా.. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నవారు, ఓటర్ ఐడీ లేకపోతే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్‌తో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ డిజిటల్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకును ఉండాలి.
Also Read..
ISRO Chief: చంద్రుడిపై దక్షిణ ద్రువాన్నే ఎందుకు ఎంచుకున్నామంటే.. కారణం ఏంటో చెప్పిన ఇస్రో చీఫ్
DSC Notification | రెండ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

