Mithun Chakraborty : ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడటంతో సోమవారం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేశారు. తన ఆరోగ్యం బాగుందని త్వరలోనే సినిమా షూటింగ్‌ల్లో తిరిగి పాల్గొంటానని మిథున్ చక్రవర్తి వెల్లడించారు.
తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో మిథున్ చక్రవర్తి (73)ని స్ధానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మిథున్‌కు ఎంఆర్ఐ సహా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలేమీ లేవని, జీవనశైలితో పాటు ఆహార అలవాట్లు మార్చుకుంటే సమస్యలు ఉండవని మిథున్ చక్రవర్తి పేర్కొన్నారు.
తాను రేపటి నుంచే షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తనకు ఫోన్ చేసి మాట్లాడారని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని మందలించారని తెలిపారు. పద్మభూషణ్ అవార్డు పొందిన మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ్ సహా పలు భాషల్లో దాదాపు 350 సినిమాల్లో నటించారు.
Read More :