Actor Darshan | కన్నడ నటుడు దర్శన్ (Actor Darshan) జైలు నుంచి బయటకు వచ్చారు. అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో (Renukaswamy murder case) .. కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుతో దాదాపు నాలుగు నెలల తర్వాత ఆయన జైలునుంచి విడుదలయ్యారు.
#WATCH | Ballari, Karnataka | Actor Darshan to be released on interim bail from Central Jail
Karnataka High Court today granted interim bail to him in connection with the Renukaswamy murder case pic.twitter.com/qsvK223S7j
— ANI (@ANI) October 30, 2024
కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
Karnataka High Court Single Judge Bench of Justice S Vishwajith Shetty grants interim bail to actor Darshan, who was arrested on June 11 for his alleged involvement in the Renukaswamy murder case.
— ANI (@ANI) October 30, 2024
ఇక ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ కోసం బెంగళూరు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం వీరి అభ్యర్థనను తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. దీంతో దర్శన్ ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలు చూపుతూ దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. నటుడి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో తాజాగా అతను జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భార్య విజయలక్ష్మి స్వయంగా జైలు వద్దకు వెళ్లారు.
#WATCH | Actor Darshan’s wife Vijayalakshmi arrives at Ballari Central Jail as her husband will be released on interim bail after the Karnataka High Court order in the Renukaswamy murder case pic.twitter.com/8fhUoklo2p
— ANI (@ANI) October 30, 2024
Also Read..
Darshan | అభిమాని హత్య కేసు.. కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు