Darshan | అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో (Renukaswamy murder case) అరెస్టై జైల్లో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ (Actor Darshan)కు ఉపశమనం లభించింది. ఆయనకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) మధ్యంతర బెయిల్ (interim bail) మంజూరు చేసింది. వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజురు చేస్తూ బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడ సహా 16మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో దర్శన్ అండ్ టీం రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిందని విచారణలో తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు ఇచ్చినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు. వీరంతా ప్రస్తుతం బెంగళూరులోని వివిధ జైళ్లలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇక ఈ కేసులో దర్శన్‌తోపాటు పవిత్ర బెయిల్ కోసం బెంగళూరు కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం వీరి అభ్యర్థనను తిరస్కరించింది. వారి బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు కోర్టు కొట్టివేసింది. దీంతో దర్శన్ ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలు చూపుతూ దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. నటుడి ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
Spain Floods | స్పెయిన్‌లో మెరుపు వరదలు.. అనేక మంది మృతి.. కొట్టుకుపోయి కార్లు
Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో విషాదం.. సూర్య ‘కంగువ’ సినిమా ఎడిటర్ మృతి
Matthew Wade: ఇండియా చేతిలో ఓడాకే .. రిటైర్మెంట్ ఆలోచన పుట్టింది : మాథ్యూ వేడ్