మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్(Matthew Wade).. అంతర్జాతీయ క్రికెట్‌కు మంగళవారం గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడింది. ఆ మ్యాచ్‌లో ఓడిన తర్వాత తనకు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలన్న ఆలోచన పుట్టినట్లు వేడ్ గుర్తు చేశాడు. తన కెరీర్ ముగిసిందో ఏమో అన్న ఆలోచన తన మెదడును తాకినట్లు చెప్పాడు. సెయింట్ లూసియాలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 24 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 రన్స్ చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ సమయంలోనే తన రిటైర్మెంట్ ఆలోచన కలిగినట్లు వేడ్ చెప్పాడు. ఇండియా చేతిలో ఓటమి తర్వాత తన కెరీర్ ముగిసిందో ఏమో అన్న భావన స్పురించిందన్నాడు. అదో భావోద్వేగపూరిత క్షణమన్నారు.
టీ20 క్రికెట్లో మిడిల్ లోయర్ ఆర్డర్లో మాథ్యూ వేడ్ సాధారణంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. అయితే కొత్తగా జోష్ ఇంగ్లిస్ వికెట్ కీపర్ బాధ్యతలు చేపడుతున్నాడు. అతను టాప్ ఆర్డర్లోనూ బ్యాటింగ్ చేయగలదు. ఆ అంశం వల్ల కూడా తనలో రిటైర్మెంట్ ఆలోచన కలిగినట్లు చెప్పాడు. టాప్ నుంచి మిడిల్ ఆర్డర్ మధ్యలో ఆడే బ్యాటర్ కోసం జట్టు చూస్తున్నదని, అందుకే జోష్ ఇంగ్లిస్ ఆ రోల్‌కు సెట్ అవుతాడని వేడ్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొనడం లేదని వేడ్ తెలిపాడు. సీజన్ సుదీర్ఘంగా సాగుతుందని, దాని వల్ల జట్టుకు అందుబాటులో ఉండే అవకాశాలు లేవన్నారు. బీబీఎల్, ఐఎల్టీ20 టోర్నీల్లో ఆడనున్నట్లు చెప్పాడు.