Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువ’ చిత్రానికి పని చేసిన ఎడిటర్ (Film Editor) నిషాద్ యూసఫ్ (Nishadh Yusuf) మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 43 ఏళ్లు.
కేరళ రాష్ట్రం కొచ్చి (Kochi)లోని పానంపిల్లి నగర్ (Panampilly Nagar)లో గల తన నివాసంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో శవమై కనిపించాడు. ఆయన మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే, నిషాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిషాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నిషాద్.. తల్లుమాల, చావెర్, ఉండా, సౌదీ వెల్లక్క, వన్, ఆపరేషన్ జావా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తల్లుమాలా చిత్రానికిగానూ 2022లో నిషాద్ బెస్ట్ ఎడిటర్‌గా నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన చివరిగా మమ్ముట్టి నటించిన బజూక, సూర్య నటించిన కంగువ చిత్రాలకు కూడా పనిచేశారు. ఈ రెండు చిత్రాలూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). సూర్య 42వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శివ (siva) దర్శకత్వం వహిస్తున్నాడు. కంగువలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. ఇంతలోనే నిషాద్ మృతి చెందడంతో.. చిత్ర యూనిట్ మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
Also Read..
Shah Rukh residence | పండుగకు ముందే షారూఖ్ ఖాన్ ఇంటికి దీపావళి కళ.. Video
Salman Khan: 2 కోట్లు ఇవ్వకుంటే.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం
Rajamouli | మహేష్‌బాబుతో యాక్షన్ అడ్వెంచర్.. లొకేషన్స్ వేటలో రాజమౌళి