Shah Rukh residence : పండుగ మరో రెండు రోజులు ఉండగానే మహారాష్ట్ర (Maharastra) రాజధాని ముంబై (Mumbai) లోని షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) నివాసం ‘మన్నాట్ (Mannat)’ దీపావళి (Diwali) కళను సంతరించుకుంది. రంగురంగుల లైట్ల కాంతులతో దగదగ వెలిగిపోతున్నది. దేశవ్యాప్తంగా ప్రజలు రేపు దీపావళి పండుగ చేసుకోనున్నారు. నరకాసుర వధ జరిగిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
అయితే ఈ ఏడాది దీపావళి అమావాస్య రెండు రోజులు వచ్చింది. రేపు గురువారం మధ్యాహ్నం మొదలై ఎల్లుండి మధ్యాహ్నం ముగుస్తుంది. దాంతో పండుగ గురువారం జరుపుకోవాలా.. లేదంటే శుక్రవారం జరుపుకోవాలా అనే సందేహం జనాల్లో ఉంది. ఈ క్రమంలో పండితులు మాత్రం శుక్రవారం రాత్రి వరకు అమావాస్య ఉండదు కాబట్టి గురువారమే దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు. షారూఖ్ ఖాన్ నివాసంలో లైటింగ్‌కు సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.