Salman Khan: 2 కోట్లు ఇవ్వకుంటే.. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం
Salman Khan: సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. రెండు కోట్లు ఇవ్వకుంటే .. హతమార్చుతామని హెచ్చరించారు. దీంతో మెసేజ్ పంపిన గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఆ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే, అతన్ని చంపేస్తామని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వొర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.
సల్మాన్‌ను బెదిరించిన కేసులో మంగళవారం 20 ఏళ్ల వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. బాబా సిద్దిక్ కుమారుడు జీషాన్ సిద్దిక్‌తో పాటు సల్మాన్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు. నిందితుడిని మొహమ్మద్ తయ్యాబ్గా గుర్తించారు. అతన్ని గుర్ఫాన్ ఖాన్ అని కూడా పిలుస్తారు. నోయిడా సెక్టార్ 39లో అతను ఉంటున్నాడు. అక్టోబర్ 12వ తేదీన బాబా సిద్ధిక్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

