Spain Floods | స్పెయిన్ (Spain)లో ఆకస్మిక వరదలు (flash floods) బీభత్సం సృష్టించాయి. మంగళవారం తూర్పు, దక్షిణ స్పెయిన్లో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 12 అంగుళాల వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలను మెరుపు వరదలు చుట్టుముట్టాయి. ఈ వరదలకు చాలా ప్రాంతాలు నదులను తలపించాయి. రహదారుల వెంబడి నీళ్లు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. వేలాదిగా కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి (Cars swept away).
España 🇪🇦 La poderosa fuerza del agua que todo lo arrasa a su paso. Impresionantes las imágenes de la #DANA en #Valencia, #España. Se trata de una Depresión Aislada. El reporte oficial indica que hay fallecidos, pero todavía no se sabe cuántos. pic.twitter.com/aijiAfE7Hh
— Periodistassinfronteras (@periodistassin2) October 30, 2024
అప్రమత్తమైన స్పానిష్ ప్రభుత్వం ఓ సంక్షేమ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమావేశమై దేశంలోని పరిస్థితిపై సమీక్షించింది. మరోవైపు ఈ వరదల్లో చాలా మంది ప్రజలు తప్పిపోయినట్లు స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అధికారుల సలహాలు, సూచనలు పాటించాలని సూచించారు. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మరోవైపు తప్పిపోయిన వారి కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. డ్రోన్ల సాయంతో వారిని గుర్తించే పనిలో పడ్డారు.
Scale of the flooding currently unfolding in Valencia, .This is footage from Chiva, where a jaw-dropping 343 mm of rain was recorded in just 4 hours earlier today#DANA #Chiva #Valencia #Flooding #SpainFloods #InundacionesEnEspañapic.twitter.com/X9D0eJ9CQR
— BlueGreen Planet (@De_le_Vega) October 30, 2024
కొన్ని చోట్ల అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. ఐరోపా తీవ్రమైన వాతావరణ డేటాబేస్ ప్రకారం.. వాలెన్సియా (Valencia)కు తూర్పున ఉన్న చివా ప్రాంతంలో కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఏకంగా 320 మిల్లీ మీటర్ల వర్షపాతం (12.6 అంగుళాలు) నమోదైంది. దీంతో వాలెన్సియా ప్రాంతంలో రాష్ట్ర వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 12 గంటల కంటే తక్కువ సమయంలో దాదాపు 200 మి.మీ (సుమారు 8 అంగుళాలు) వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అలర్ట్తో అధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాల తరగతులు, క్రీడా కార్యక్రమాలను నిలిపివేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలకు చెందిన కార్యకలాపాల్ని మూసివేయాలని ఆదేశించారు.
🚨 🇪🇸 CAOS Y DEVASTACIÓN AZOTA A VALENCIA, ESPAÑA
Impactantes estragos en Valencia debido a la fuerte tormenta. Imágenes muestran inundaciones y daños que afectan a la región en este momento.#Valencia #España pic.twitter.com/cuiLesX9pS
— SantiContreras (@SantiContreras) October 29, 2024
ఈ మెరుపు వరదలు రవాణాను తీవ్రంగా ప్రభావితం చేశాయి. వాలెన్సియా విమానాశ్రయం నుంచి దాదాపు 12 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. మరో పది విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ వరదలకు అండలూసియాలో ఓ హై-స్పీడ్ రైలు పట్టాలు తప్పింది. మాడ్రిడ్ నుంచి వాలెన్సియా మధ్య 276 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.
Kann ich nochmal die Klimakleber sehen? #Klimakatastrophe #Valencia pic.twitter.com/Q3zrBZ8oME
— Beatrix Kiddo_Kriegsgeil (@Beatrix_Kiddo_0) October 29, 2024
torrential rain brings flash flooding and tornado in spain
this intense rain has been attributed to a phenomenon know as the “gota fria” or “cold drop ” #SpainFloods pic.twitter.com/pK1wL0zuD0— jaime (@kingslayer945) October 29, 2024
Also Read..
Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో విషాదం.. సూర్య ‘కంగువ’ సినిమా ఎడిటర్ మృతి
Fat Reducing Foods | కొవ్వును కరిగించే ఆహారాలు ఇవి.. తప్పకుండా తీసుకోవాలి..!