Fat Reducing Foods | శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోవాలంటే రోజూ వ్యాయామం చేయడంతోపాటు మనం తీసుకునే ఆహారంలోనూ పలు మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. మనం రోజూ తినే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల శరీర మెటబాలిజం మెరుగు పడుతుంది. ఇది క్యాలరీలను కరిగిస్తుంది. దీంతో కొవ్వు త్వరగా కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. ఇక మన శరీరంలోని కొవ్వును కరిగించేందుకు పలు ఆహారాలు ఎంతో ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ శరీరంలోని కొవ్వు నిల్వలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులోకి వస్తాయి. పీచు పదార్థాన్ని అందించే క్యారెట్‌ను వారంలో ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేరుగా తినే ప్రయత్నం చేయండి. లేదా జ్యూస్ తాగినా చాలు, బరువు తగ్గుతారు.
కోడిగుడ్లు అంటే బరువును పెంచుతాయని అనుకుంటారు, కానీ ఇది పొరపాటు, ఇవి బరువును తగ్గిస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలే కాదు, గుడ్లలోని విటమిన్ బి12 కొవ్వు కారకాలతో పోరాడుతుంది. దీంతో కొవ్వు కరిగిపోతుంది. కనీసం రోజుకు ఒక కోడిగుడ్డును తింటే ఫలితం ఉంటుంది.
వంటకాల్లో నిత్యం వేసే చిటికెడు పసుపుతో కలిగే మేలు అంతా ఇంతా కాదు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పసుపుతో శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరుగుతుంది. అదనంగా కొన్ని రకాల క్యాన్సర్ల తీవ్రతను తగ్గించే గుణం పసుపు సొంతం. కాలేయంలో చేరిన వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపేస్తుంది. నాళాల్లో రక్త ప్రసరణ వేగవంతం అయ్యేందుకు సహాయం చేస్తుంది. దీంతో గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
కొవ్వు శాతాన్ని తగ్గించడమే కాదు, అదనంగా పేరుకోకుండా చేసే శక్తి కరివేపాకుకు ఉంది. శరీరంలోని వ్యర్థాలనూ బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారు ప్రతి రోజూ కరివేపాకును ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.
ఇతర నూనెలతో పోల్చితే ఆవనూనెలో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో అధిక కొవ్వు చేరదు. అంతేకాదు ఈ నూనెలో ఫ్యాటీ ఆమ్లాలు, ఓలిక్, లినోలిక్ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యాధులను నయం చేస్తాయి. అందుకనే ఈ నూనెను తరచూ తీసుకోవాలి.
ఇవే కాకుండా క్యాబేజీ, మొలకెత్తిన పెసలు, తేనె, గ్రీన్ టీ వంటి ఫుడ్స్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ శరీర మెటబాలిజంను పెంచి బరువును తగ్గించేందుకు ఎంతగానో దోహపపడతాయి. కనుక వీటిని తప్పకుండా తీసుకోవాలి.