King Charles | భారత్‌లో కింగ్ చార్లెస్ దంపతుల సీక్రెట్ పర్యటన.. వెల్నెస్ కేంద్రంలో థెరపీ చికిత్సలు..!
King Charles | బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ - 3 (King Charles) సీక్రెట్‌గా భారత్ పర్యటకు (Personal Visit) వచ్చినట్లు తెలిసింది.
King Charles | బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ – 3 (King Charles) సీక్రెట్‌గా భారత్ పర్యటకు (Personal Visit) వచ్చినట్లు తెలిసింది. సతీమణి క్వీన్ కెమిల్లా (Queen Camilla)తో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరు (Bengaluru)కు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్ 27 నుంచి వారు బెంగళూరులోని ఓ వెల్నెస్ సెంటర్లో బస చేస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
కింగ్ చార్లెస్ దంపతులు ఈ నెల 21 నుంచి 26 మధ్య కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు సీక్రెట్‌గా వచ్చినట్లు సదరు కథనాలు తెలిపాయి. వారు బెంగళూరులోని ఓ వెల్నెస్ సెంటర్లో బస చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సెంటర్లో యోగా, ధ్యానం వంటి సెషన్స్‌తో సమయం గడుపుతున్నట్లు తెలిసింది. వెల్నెస్ సెంటర్ సిబ్బంది కింగ్ చార్లెస్, కెమిల్లాకు వివిధ రకాల థెరపీ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ఈ సీక్రెట్ ట్రిప్ ముగించుకొని ఇవాళ వీరు బ్రిటన్ బయల్దేరనున్నట్లు తెలిసింది. వీరు బస చేస్తున్న వెల్నెస్ సెంటర్.. యోగా, ధ్యాన సెషన్లు, థెరపీ చికిత్సలకు ప్రసిద్ధి చెందినదిగా ఓ అధికారిని ఊటంకిస్తూ సదరు కథనాలు నివేదించాయి.
Also Read..
Naga Chaitanya | నాగచైతన్య – శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?
Spain Floods | స్పెయిన్‌లో మెరుపు వరదలు.. అనేక మంది మృతి.. కొట్టుకుపోయిన కార్లు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

