Naga Chaitanya | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో ఈ జంట సింపుల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో అంతా వీరి పెళ్లి ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు (Marriage Date Fix) తెలిసింది. డిసెంబర్లో వీరు వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజా సమాచారం.
డిసెంబర్ 4వ తేదీన వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2వ తేదీన సంగీత్, మూడో తేదీన మెహందీ, నాలుగో తేదీన పెళ్లి జరగనున్నట్లు తెలిసింది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్స్ 2024 వేడుకలో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం. పెళ్లి తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు సమాచారం. అయితే, వీరు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోనే చేసుకుంటారా..? అన్నదానిపై నెటిజన్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం రాజస్థాన్‌లో నాగచైతన్య-శోభిత ధూళిపాళ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశారట. ఇక దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక పెళ్లి తంతులో భాగంగా ఇటీవలే శోభిత నివాసంలో పసుపు దంచే కార్యక్రమాన్ని కూడా సంప్రదాబద్ధంగా పూర్తి చేశారు. తన హల్దీ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి వైజాగ్‌లోని తన ఇంట్లో పసుపు దంచుతున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala).. లవ్ సితార అంటూ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read..
Water Shortage | కాలుష్య కోరల్లో యమునా నది.. ఢిల్లీలో నీటి కొరత
Darshan | అభిమాని హత్య కేసు.. కన్నడ నటుడు దర్శన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు
Air Pollution | ఢిల్లీలో అధ్వానస్థితికి గాలి నాణ్యత.. 300కి పడిపోయిన ఏక్యూఐ