Corona Virus | దేశంలో కొవిడ్-19 (Covid-19) వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో అంటే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకూ 358 కొత్త కేసులు వెలుగు చూశాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,491కి పెరిగింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం (Health Ministry Of India).. కేరళలో అత్యధికంగా 1,957 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 980 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747 కేసులు, ఢిల్లీలో 728 కేసులు, మహారాష్ట్రలో 607 కేసులు, కర్ణాటకలో 423 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా నమోదుకాకపోవడం ఊరటనిచ్చే విషయం. ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో 65 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సంసిద్ధతను తనిఖీ చేసేందుకు కేంద్రం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అన్ని దవాఖానాలలో ఆక్సిజన్, ఐసోలేషన్ బెడ్స్, వెంటిలేటర్లు, ఇతరఅత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.
Also Read..
IED blast | మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతి
Overcrowded Local Train | రైల్లో నుంచి జారిపడి ఐదుగురు ప్రయాణికులు మృతి
Honeymoon Couple | వీడిన హనీమూన్ జంట మిస్సింగ్ కేసు మిస్టరీ.. భర్తను భార్యే హత్య చేయించింది