Maharashtra Assembly Elections : మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ముంబైలోని మొత్తం 36 సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ మంగళవారం ప్రకటించింది. ముంబైలోని అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు పార్టీ శ్రేణులు ఇప్పటికే సమాయాత్తమయ్యాయని ఆప్ ముంబై చీఫ్ ప్రీతి శర్మ మీనన్ తెలిపారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను విజయవంతంగా నడుపుతున్నదని చెప్పారు. తమకు గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలున్నారని, పార్లమెంట్‌కు గణనీయ సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. పదేండ్లలోనే ఢిల్లీ తరహా అభివృద్ధి మోడల్‌ను ఆప్ దేశానికి పరిచయం చేసిందని చెప్పారు.
నాణ్యమైన విద్య, వైద్యం, మంచినీరు, విద్యుత్ సరఫరా వంటివి ఉచితంగా అందించడమే కాకుండా అవినీతి లేకుండా చూసిందని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ మోడల్‌తో ఆప్ స్వచ్ఛమైన రాజకీయాలు, నూతన రాజకీయ సంస్కృతిని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియతో ముందుకెళుతుందని ప్రీతి శర్మ పేర్కొన్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబడతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
Read More :
Cognizant | హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ విస్తరణ.. 15 వేల మంది యువతకు ఉద్యోగాలు!