Lok Sabha Elections 2024 : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 7 స్ధానాలకు గాను కేవలం ఒకే ఒక స్ధానాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆప్ ఆఫర్ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఉత్కంఠ నడుమ లేటెస్ట్ ఆఫర్‌తో ఆప్ ముందుకొచ్చింది.
లోక్‌సభ ఎన్నికలకు పొత్తు ఖరారులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఢిల్లీలో పాలక ఆప్, ఇండియా కూటమి ప్రధాన భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ సామర్ధ్యం ఆధారంగా చూస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని అయితే సంకీర్ణ ధర్మంలో భాగంగా వారికి ఢిల్లీలో ఒక సీటు కేటాయించేందుకు ముందుకొచ్చామని ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో కాంగ్రెస్ ఒక స్ధానంలో ఆప్ 6 స్ధానాల్లో పోటీ చేసేందుకు తాము కాంగ్రెస్ ముందు ప్రతిపాదించామని అన్నారు. ఢిల్లీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుపొందలేదని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులకు గాను కాంగ్రెస్ కేవలం 9 వార్డుల్లోనే విజయం సాధించిందని పాఠక్ పేర్కొన్నారు.అయితే ఢిల్లీలో అధిక స్ధానాలను కాంగ్రెస్ కోరుతుండటంతో సీట్ల సర్దుబాటు చర్చలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు.
Read More :
Deep Sleep | ఎంతసేపు నిద్ర పోయాం అనేది కాదు.. ఎంత గాఢంగా నిద్రపోయాం అన్నదే ముఖ్యం..