Deep Sleep | నిద్ర కేవలం విశ్రాంతి మాత్రమే కాదు. శరీరం తన ఆరోగ్యాన్ని సరిదిద్దుకునే కీలక సమయం కూడా. అందుకే ఎంతసేపు నిద్ర పోయాం అనేది కాకుండా, ఎంత గాఢంగా నిద్రపోయాం అన్నదే ముఖ్యం. నిద్రలో గాఢత లోపిస్తే ఏం జరుగుతుంది? అనే అనుమానం కలిగింది కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ ప్రతినిధులకు. ఆ అధ్యయనం కోసం 40 ఏండ్ల సగటు వయసు కలిగిన 526 మంది స్త్రీపురుషులను ఎంచుకున్నారు.
వారిని మూడు రోజుల పాటు శ్రద్ధగా గమనించారు. ఆ మూడురోజులూ కూడా చేతికి ఒక మానిటర్ తగిలించారు. మరుసటి రోజు వారి అభిప్రాయాలు సేకరించడం ద్వారా నిద్ర తీరును గ్రహించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా, పద కొండేండ్ల పాటు నిశితంగా గమనించినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. ఒకప్పుడు నిద్ర సరిగా పట్టనివారి జ్ఞాపక శక్తి, మిగతావారితో పోలిస్తే… మందగించినట్టు కనిపించింది. అల్జీమర్స్ లక్షణాలనూ గుర్తించారు. కాబట్టి, గాఢంగా నిద్రపోండి.