Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పుట్టినరోజు (birthday) నేడు. ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలు (Aam Aadmi Party workers ) తమ సుప్రిమో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు.
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యకర్తలు జైలు (Tihar Jail) బయట కేజ్రీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి కేజ్రీవాల్ ఫొటోకు తినిపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరోవైపు కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
#WATCH | Aam Aadmi Party workers celebrate Delhi CM & party leader Arvind Kejriwal’s birthday outside Tihar Jail in Delhi pic.twitter.com/7Kuz3MNJPX
— ANI (@ANI) August 16, 2024
Also Read..
Assembly Polls | దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. నాలుగు రాష్ట్రాలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!
Thailand | థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా పేటోంగ్టార్న్ ఎన్నిక.. రెండో మహిళా ప్రధానిగా రికార్డు