Hrithik Roshan | పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో (Kolkata) గల ఆర్జీ కార్ వైద్యశాలలో (R G Kar Medical College) 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. గత ఏడు రోజుల నుంచి ఆరోగ్య సేవలు స్తంభించగా, తమ సహచర విద్యార్థినికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. బాధిత మహిళా డాక్టర్‌కు న్యాయం జరిగేలా చూడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan) తాజాగా స్పందించారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్టవేయడానికి కఠినమైన శిక్షలే ఏకైక మార్గం అని అభిప్రాయపడ్డారు.
‘ప్రతి ఒక్కరూ సమానంగా సురక్షితంగా ఉండే సమాజం మనందరికీ కావాలి. కానీ అది పరిణామం చెందేందుకు దశాబ్దాలు పడుతుంది. సురక్షితమైన సమాజం మన కుమారులు, కుమార్తెలను శక్తిమంతం చేయడంలో తోడ్పడుతంది. దీని వల్ల రాబోయే తరాలు బాగుపడతాన్నారు. అయితే, ఈ మధ్యకాలంలో ఏం జరుగుతోంది..? ఇలాంటి దురాగతాలు జరగకుండా ఉండాలంటే నిందితులకు కఠినమైన శిక్షలు విధించడమే ఏకైక మార్గం. అది మనకు కూడా చాలా అవసరం. బాధిత కుటుంబానికి నేను అండగా ఉంటాను. నిన్న రాత్రి దాడికి గురైన వైద్యులందరికీ సపోర్ట్‌గా నిలబడతాను’ అని హృతిక్ రోషన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
Yes we need to evolve into a society where we ALL feel equally safe. But that is going to take decades. It’s going to hopefully happen with sensitizing and empowering our sons and daughters. The next generations will be better. We will get there. Eventually. But what in the…
— Hrithik Roshan (@iHrithik) August 15, 2024
Also Read..
Assembly Polls | దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. నాలుగు రాష్ట్రాలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!
SSLV-D3 | ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం