Parasakthi | శివకార్తికేయన్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పరాశక్తి’ ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా ‘U/A’ సర్టిఫికేట్ను జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యం ఉన్నందున, తొలుత సెన్సార్ బోర్డు 23 కట్స్ సూచించినప్పటికీ, రివైజింగ్ కమిటీ పరిశీలన తర్వాత కొన్ని మార్పులతో క్లియరెన్స్ లభించింది. సుమారు 162 నిమిషాల నిడివి ఉన్న ఈ పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలో శివకార్తికేయన్ కాలేజీ విద్యార్థిగా కనిపించనున్నారు.
ఈ సినిమా తమిళ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే తెలుగులో సంక్రాంతి సినిమాల రద్దీ మరియు థియేటర్ల లభ్యత తక్కువగా ఉన్న కారణంగా, తెలుగు వెర్షన్ విడుదలను జనవరి 23కి వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జయం రవి, అథర్వ మురళి కీలక పాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్కు ఇది 100వ సినిమా కావడం విశేషం. విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడటంతో ప్రస్తుతం తమిళనాట ‘పరాశక్తి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.