Assembly Polls | దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. నాలుగు రాష్ట్రాలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!
Assembly Polls | లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
Assembly Polls | లోక్‌సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు వెల్లడించినట్లుగా జాతీయ మీడియా పేర్కొంది.
శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ (Election Commission) మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే హర్యానా (Haryana), మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలిసింది. దీంతోపాటు జమ్మూ కశ్మీర్లో (Jammu And Kashmir) అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, ఏఏ రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుందో మాత్రం తెలియాల్సి ఉంది.
మహారాష్ట్ర, హర్యానా విధానసభల పదవీకాలం నవంబర్ 3, నవంబర్ 26తో ముగియనుంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం మాత్రం వచ్చే ఏడాది జనవరితో ముగుస్తుంది. దీంతో ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల ఖాయంగా తెలుస్తోంది. ఇక జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు జమ్మూకశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవలే కమిషన్ బృందం లోయను సందర్శించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తీసుకుంది.
మరోవైపు ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లో 58.58 శాతం పోలింగ్ నమోదు కావడం పట్ల ఈసీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. గత మూడునాలుగు దశాబ్దాల్లో ఈసారే కశ్మీర్లో ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు ఓటింగ్‌కు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడే నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. కాగా, గతంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో 107 స్థానాలు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. వీటిలో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండగా మిగతా 90 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో జమ్ము ప్రాంతంలో 43 స్థానాలు, కశ్మీర్ వ్యాలీలో 47 స్థానాలు ఉన్నాయి.
Also Read..
SSLV-D3 | ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలోకి శ్రద్దా కపూర్ స్త్రీ 2 ఎంట్రీ..!
Nani | ఓజీ డైరెక్టర్ సుజిత్ సినిమాకు బ్రేక్ పడిందా..? నాని క్లారిటీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

