Nani | టాలీవుడ్ యువ దర్శకుల జాబితాలో ముందువరుసలో ఉంటాడు సుజిత్ (Sujeeth). హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలువడం ఈ డైరెక్టర్ స్పెషాలిటీ. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. మరోవైపు సహజసిద్దమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani).
ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుందంటూ ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే సుజిత్ పలు కారణాల వల్ల నాని సినిమాను ఆపేశాడంటూ ఇండస్ట్రీ సర్కిల్లో ఓ వార్త షికారు చేస్తోంది. తాజాగా నాని పుకార్లపై క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ మూవీ ఆగస్టు 29న విడుదల కానుంది. మరోవైపు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా పూర్తయ్యాక సుజిత్ సినిమా చేయబోతున్నట్టు హింట్ ఇచ్చేశాడు.
అంతేకాదు మాస్ అవతార్‌లో చూపించబోతున్నాడని.. తనను మాస్ హీరోగా చూడాలన్న అభిమానుల కలను సుజిత్ నెరవేర్చబోతున్నాడని చెప్పి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు నాని. ఈ స్టార్ యాక్టర్ మరోవైపు హిట్ ౩ను కూడా లైన్లో పెట్టాడని తెలిసిందే.
Stree 2 | ఫైటర్, కల్కి 2898 ఏడీ రికార్డు బ్రేక్.. ఆ జాబితాలో కూడా స్త్రీ 2 ఎంట్రీ..!
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్