Thalapathy 69 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రస్తుతం రెండు సినిమాలను ట్రాక్‌లో పెట్టాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ది గోట్ (The GOAT) ఒకటి. మరోవైపు దళపతి 69 (Thalapathy 69)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. విజయ్ పొలిటికల్ కెరీర్‌పై ఫోకస్ పెట్టనున్న నేపథ్యంలో ఇదే చివరి సినిమా కానుంది. కాగా చాలా రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త వార్తలేమి బయటకు రాలేదు.
ఈ సినిమాను తానే డైరెక్టర్ చేస్తున్నట్టు హెచ్ వినోథ్ క్లారిటీ ఇచ్చేశాడు. అంతేకాదు ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సినిమా జోనర్ ఇది కాదట. ఓ అవార్డు ఫంక్షన్లో హెచ్ వినోథ్ మాట్లాడుతూ.. ఇది పొలిటికల్ సినిమా కాదని, కమర్షియల్ ఎంటర్టైనర్ అని చెప్పాడు. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ చిత్రాన్ని పాపులర్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. విజయ్ పొలిటికల్ కెరీర్ ప్లాన్‌కు కలిసొచ్చేలా కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచేపోయేలా డైరెక్టర్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తు్నాడని అంతా తెగ చర్చించుకుంటుండగా.. దళపతి 69కు సంబంధించిన హెచ్ వినోథ్ చేసిన తాజా కామెంట్స్‌తో ఇక ఈ సినిమా కూడా రెగ్యులర్ కమర్షియల్ పంథాలోనే సాగుతుందని అర్థమవుతోంది. మరి ఎలాంటి స్టోరీని సిద్దం చేశాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
కాగా ఈ మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు కీలక పాత్రలో నటించనుండగా.. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నాడు. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో