Devara Part 1 | జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది.దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. దేవర పార్టు 1 ఓవర్సీస్ హక్కులను పాపులర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సొంతం చేసుకుంది.
ఓవర్సీస్లో దేవరను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఓవర్సీస్ రైట్స్‌కు దక్కించుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. అంటూ హంసినీ ఎంటర్టైన్మెంట్ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇది జాన్వీకపూర్‌కు డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం.
=ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమానుంచి అదిరిపోయే గ్లింప్స్ వీడియోను షేర్ చేయగా.. మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరోవైపు దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ AllHailTheTiger అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తన్నాడు. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
దేవరకు పాపులర్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ దేవర డిజిటల్ రైట్స్‌ను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోండగా.. మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
“THE LORD OF FEAR IS COMING”
We are proud & excited to announce that #Devara Entire Overseas Distribution Rights bagged by #HamsiniEntertainment 🌊⚡ #DevaraOnSep27th
Man of Masses @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/6YpuzsC2Ts
— Hamsini Entertainment (@Hamsinient) August 15, 2024
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో