Stree 2 | బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు కాంబినేషన్లో వచ్చిన తాజా సీక్వెల్ ప్రాజెక్ట్ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్ కౌశిక్ దర్శకత్వంలో కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ గురువారం (ఆగష్టు 15న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఓపెనింగ్ డేన సూపర్ హిట్ మౌత్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
స్త్రీ 2 ఈ ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఫైటర్, కల్కి 2898 ఏడీ (హిందీ) ఓపెనింగ్ డేన రూ.22-24 కోట్లు వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు ఏకంగా డబుల్ మార్జిన్‌తో ఈ ఫిగర్‌ను స్త్రీ 2 ఓవర్టేక్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. బాలీవుడ్లో 2024లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలువడమే కాదు..ఆల్ టాప్ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో స్త్రీ 2 స్థానం సంపాదించింది.
ఫస్ట్ డేనే రూ.47 కోట్ల కలెక్షన్లతో హీరోలు కూడా సాధించని అరుదైన ఫీట్ నమోదు చేసి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది శ్రద్దాకపూర్. పెయిడ్ ప్రివ్యూస్ కలుపుకుంటే స్త్రీ 2 ఇండియావ్యాప్తంగా రూ.55 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు ట్రేడ్ సర్కిల్ సమాచారం. ఫస్ట్ లుక్, ట్రైలర్‌కు సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేయడంలో కీ రోల్ పోషించాయని చెప్పాలి. ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.
#Stree2 collected ₹44cr on day1. The film collected ₹7cr from previews.
Total – ₹51cr.
It’s a new record in the Bollywood history.@ShraddhaKapoor @RajkummarRao #PankajTripathi
— Ria (@Its_DailyHub) August 16, 2024
The Goat Trailer | విజయ్ ది గోట్ ట్రైలర్ ఆన్ ది వే.. సస్పెన్స్‌కు వెంకట్ ప్రభు చెక్
Devara Part 1 | పాపులర్ కంపెనీకి తారక్ దేవర ఓవర్సీస్ రైట్స్.. గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్
Amaran | జవాన్ల సేవలను స్మరించుకుంటూ.. శివకార్తికేయన్ అమరన్ మేకింగ్ వీడియో