Delhi Assembly Elections | వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 11 మందితో తొలి జాబితాను రిలీజ్ చేసిన అధికార ఆప్.. తాజాగా 20 మంది అభ్యర్థులతో రెండో జాబితాను కూడా విడుదల చేసింది.
ఇక ఈ లిస్ట్‌లో మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) పేరు ఉంది. ఆయన ఈసారి పట్పర్గంజ్ (Patparganj) అసెంబ్లీ స్థానం నుంచి కాకుండా.. జంగ్‌పురా(Jangpura) నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవలే ఆప్‌లో చేరిన ఉపాధ్యాయుడు అవధ్ ఓజాకు (Avadh Ojha) పట్పర్గంజ్ స్థానాన్ని కేటాయించారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
Aam Aadmi Party releases its second list of candidates for Delhi assembly elections 2025
Former Dy CM Manish Sisodia to contest from Jangpura, Avadh Ojha from Patparganj pic.twitter.com/7gq5xX87yi
— ANI (@ANI) December 9, 2024
Also Read..
Rajya Sabha | రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం
R Krishnaiah | మళ్లీ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య.. బీజేపీ తరపున రేపు నామినేషన్ దాఖలు
Rahul Narwekar: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నిక