Rajya Sabha | ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో రాజ్యసభ (Rajya Sabha) ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది (BJP releases a list of candidates).
ఆంధ్రప్రదేశ్, హర్యాణా, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులను కమలం పార్టీ సోమవారం ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్. కృష్ణయ్య (R. Krishnaiah)కు అవకాశం కల్పించింది. గతంలో వైసీపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికై ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ తరఫున పెద్దల సభకు ఆయనకు అవకాశం వచ్చింది. ఇక హర్యాణా నుంచి రేఖా శర్మ, ఒడిశానుంచి సుజీత్ కుమార్ను అభ్యర్థులుగా ప్రకటించింది.
BJP releases a list of candidates for the upcoming by-elections to the Rajya Sabha
Ryaga Krishnaiah from Andhra Pradesh, Rekha Sharma from Haryana and Sujeet Kumar from Odisha pic.twitter.com/yuT1pQvt2U
— ANI (@ANI) December 9, 2024
దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు డిసెంబర్ 20న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని మూడు స్థానాలు, ఒడిశా, పశ్చిమబెంగాల్, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. నామినేషన్ల స్వీకరణకు రేపు (డిసెంబర్ 10) చివరి గడువు. ఇక 11వ తేదీ స్క్రూటినీ, 13 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. డిసెంబర్ 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
Also Read..
R Krishnaiah | మళ్లీ రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య.. బీజేపీ తరపున రేపు నామినేషన్ దాఖలు
Rahul Narwekar: మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నర్వేకర్ ఏకగ్రీవ ఎన్నిక