UIDAI | బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితా (Bihar voter revision) ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ (Aadhaar)ను మినహాయించడంపై వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం వేళ భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) స్పందించింది. ఈ మేరకు ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ (UIDAI CEO Bhuvnesh Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదని స్పష్టం చేశారు.
ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో భువనేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఫేక్ ఆధార్ కార్డులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా క్యూఆర్ స్కానర్ యాప్ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ‘కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఉడాయ్ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ (Aadhaar QR scanner app) ద్వారా స్కాన్ చేసి వివరాలను సరిపోల్చుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఫేక్ ఆధార్ కార్డులను అడ్డుకోవచ్చు’ అని తెలిపారు. ఈ కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి దశలో ఉందని ఉడాయ్ చీఫ్ వెల్లడించారు.
Also Read..
Electoral Rolls: ఓటర్ల జాబితా సవరణను వ్యతిరేకిస్తూ.. రాహుల్ గాంధీ నేతృత్వంలో బీహార్లో ర్యాలీ
Amarnath Yatra | కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర.. తొలి ఆరు రోజుల్లోనే లక్ష మందికిపైగా దర్శనం
Google AI Mode | భారత్లో అందుబాటులోకి గూగుల్ ఏఐ మోడ్